Harish Rao : దేవుళ్ళకు కూడా మొండి చెయ్యి : హరీష్ రావు

by Y. Venkata Narasimha Reddy |

Be stubborn even to the gods: Harish Rao

Harish Rao : దేవుళ్ళకు కూడా మొండి చెయ్యి : హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్ : Be stubborn even to the gods: Harish Raoరాష్ట్రంలోని ఆదాయం లేని చిన్న ఆలయాలకు ధూప, దీప నైవేద్యం(DDS) పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు రెండు నెలలు(Funds Two Months Dues)గా ఆగిపోయాయని పేర్కొన్నారు. ధూప, దీప నైవేద్యాలకు పైసలు లేక, అర్చకులు ఉద్దెరకు పూజ సామగ్రి తెచ్చుకుని నిత్య దైవారాధనలు చేయాల్సిన దుస్థితి నెలకొందని మండి పడ్డారు.వెంటనే రెండు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డీడీఎస్ స్కీమ్ కింద రాష్ట్రంలోని 6,541ఆలయాల నిర్వాహణకు ఒక్కో ఆలయానికి ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సహాయం అందిస్తుండగా, ఇందులో రూ.7వేలు అర్చకుడి భృతికి, రూ.3వేలు ధూప, దీప నైవేధ్యాలకు కేటాయిస్తారు. అయితే రెండు నెలలుగా ఎండోమెంట్ నుంచి ఈ నిధులు రూ. 1.308కోట్ల మేరకు ఆగిపోవడంతో అర్చకులు ఆలయాల నిర్వాహణలో ఇబ్బంది పడుతున్నారని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి నెలతో కలిపి మూడు నెలల బకాయిలు రూ.19.62కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుందని హరీష్ రావు గుర్తు చేశారు.

Next Story