- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వానా కాలం విద్యుత్‌తో జాగ్రత్త
రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్‌పరంగా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో విద్యుత్ పరంగా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ కోరారు. ఈ మేరకు గురువారం చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో ఆయన టెలీకాన్ఫరెన్స్నిర్వహించి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భముగా సీఎండీ ముషారఫ్ ఫరూఖీ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా ప్రస్తుతం సాధారణంగా ఉందని, అయితే వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ముఖ్యంగా అత్యాధునిక సాంకేతితతో కూడిన 212 జీపీఎస్ ఆధారిత ఆటోలు, 101 ఈఆర్టీ వాహనాలు , ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం లు రెడీగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో మరో రెండు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశమున్నందున జిల్లాలు, సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లు సర్కిల్ కంట్రోల్ రూమ్ నుండి విద్యుత్ సరఫరా పై పర్యవేక్షణ చేపట్టాలన్నారు. వర్షాలపై నిరంతరం అప్రమత్తంగా ఉండి క్షేత్ర స్థాయి సిబ్బందికి తగిన సూచనలు , ఆదేశాలు జారీ చేయాలన్నారు. వర్షాలు పడేటప్పడు సాధారణ ప్రజలు, విద్యుత్ వినియోగదారులు తమ గృహంలో, బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ పరికరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని సందర్భాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరి స్విచ్ బోర్డు లలోకి ప్యానెల్ లోకి చేరే అవకాశం ఉటుందని, ఇది ప్రమాదకరం కూడానన్నారు. విద్యుత్ కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912, స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ కు , సర్కిల్, జిల్లాల కంట్రోల్ రూమ్ లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు.






