తెలంగాణపై పెద్ద మనసు చూపండి..ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి

by Prasad Jukanti |   (  Updated:2026-05-10 10:51:19  IST  )

దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర అభివృద్ధిలో మోడీ సహకరించాలని కోరారు.

తెలంగాణపై పెద్ద మనసు చూపండి..ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణను నంబర్ వన్ చేయడమే మా లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని చెప్పారు. వీటని సాధించేందుకు, తెలంగాణ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహకారం కావాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇవాళ హెచ్ఐసీసీలో జరిపిన పలు అభివృద్ధి ప్రారంభోత్సవాల కార్యక్రమంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని ఇది వికాస్ ఉత్సవం అన్నారు. ప్రధాని ప్రణాళిక అయిన వికసిత్ భారత్‍తో కలిసి నడుస్తామని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయాయని ఇప్పుడు రాజకీయాలు మాట్లాడాల్సిన పని లేదు అభివృద్ధి గురించే మాట్లాడదామన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3 శాతం వాటా కలిగి ఉందని దేశ జీడీపీకి తెలంగాణ 5 శాతం వాటా ఇస్తోందన్నారు. ప్రధానిది పెద్ద మనసు అని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అంటుంటారు. తెలంగాణపై కూడా పెద్ద మనసు చూపించాలని విజ్ఞప్తి చేశారు. మోడీపై తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని దేశాన్ని మోడీ అభివృద్ధి చేస్తున్నారు కానీ తెలంగాణకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్నారు.

పీంవోలో స్పెషల్ టాస్క్ పెట్టండి:

దేశాభివృద్ధిలో ఆరు మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని , దేశానికి సింహభాగం ఆదాయం ఇస్తున్న ఆరు నగరాలను కేంద్రం ప్రోత్సహించాలని సీఎం అన్నారు. ఈ ఆరు నగరాల అభివృద్ధి, అనుమతుల కోసం పీఎంవోలో స్పెషల్ టాస్క్ ఫోర్స్, సింగిల్ విండో విధానం కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. నేను ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో అనేక సార్లు కలిశానని నేను కలిసి పనుల్లో కొన్ని పనులు అయ్యాయని, మరి కొన్ని పెండింగ్ లో ఉన్నాయన్నారు. వికసిత్ భారత్ కోసం మీరు ఎంత వేగంగా పని చేస్తున్నారో తెలంగాణలో అంత వేగంగా పనులు జరగడం లేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్, మూసీ, ఫ్యూచర్ సీటీ, రేడియల్ రోడ్డు, హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్టు కోసం హైవే, రైల్వే లైన్ అంశాలపై కేవలం ప్రధాని మోడీ కేవలం 2 గంటల సమయం ఇవ్వాలన్నారు. మా ప్రతిపాదనలన్నీ మీ ముందు ఉంచుతామన్నారు.

Next Story