- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ 42% రిజర్వేషన్లపై ప్రధాని మోడీని కలవాలి : మాజీ ఎంపీ వీహెచ్
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రం నుంచి అఖిల పక్షం ప్రతినిధి బృందం కలిసే విధంగా ప్రయత్నం చేయాలని టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ ని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హన్మంతరావు కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీని రాష్ట్రం నుంచి అఖిల పక్షం ప్రతినిధి బృందం కలిసే విధంగా ప్రయత్నం చేయాలని టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ ని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హన్మంతరావు కోరారు. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు పైన మహేష్ కుమార్ గౌడ్ తో వీహెచ్ సుదీర్ఘంగా చర్చించారు. గాంధీ భవన్ లో గురువారం భేటీ అయిన వీరిద్దరు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు అమలు కోసం చేసిన కుల గణన, బీసీ కమిషన్ ఏర్పాటు, డెడికేషన్ కమిషన్ నివేదిక, అసెంబ్లీ, మండలి తీర్మానాలు, కేబినెట్ తీర్మానాలు తదితర అంశాలపై చర్చించారు.
ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు అంశం ముగిసిన అధ్యాయం కాదని, ఎలాగైనా సాధించి తీరాలని.. అందుకు తగిన విధంగా వ్యూహాలు రూపొందించాలని టీపీసీసీ చీఫ్వీహెచ్ లు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ బీసీ నాయకులు ఏఐసీసీ అగ్రనేతను కలిసి జాతీయ స్థాయిలో మరింత వత్తిడి పెంచేలా పోరాటం చేయాలని నేతలు ప్రతిపాదించారు.






