- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG High Court: బీసీ రిజర్వేషన్ల విచారణ రేపటికి వాయిదా
బీసీ రిజర్వేషన్ల(BC Reservation) విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) వాయిదా వేసింది.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల(BC Reservation) విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High Court) వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల తరపు వాదనల అనంతరం.. ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. రేపు మరికొన్ని వాదనలు వినిపిస్తామని పేర్కొన్నారు. నామినేషన్ల వేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది.
‘‘బీసీ రిజర్వేషన్ల బిల్లును అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. రాజకీయాలకు అతీతంగా మద్దతు లభించింది. జీవో నంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరడం సరికాదు. సమగ్ర కులగణన ద్వారానే ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రజాసంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. బీసీ ప్రత్యేక (డెడికేటెడ్) కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచొచ్చు. చట్టసభలు చేసిన చట్టాలను కొంతమంది గవర్నర్లు త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు. బిల్లులను ఆమోదించడం లేదు, తిరస్కరించడం లేదు, తిప్పిపంపడం లేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ గవర్నర్ ఇలాగే వ్యవహరించారు. వారి చర్యల వల్ల ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోతున్నాయి’’ అని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు.






