HYD: ఏజీ సుదర్శన్ రెడ్డితో BC మంత్రుల సమావేశం

by Gantepaka Srikanth |

అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి(AG Sudarshan Reddy)తో తెలంగాణ బీసీ మంత్రులు(BC Ministers) సమావేశం అయ్యారు.

HYD: ఏజీ సుదర్శన్ రెడ్డితో BC మంత్రుల సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి(AG Sudarshan Reddy)తో తెలంగాణ బీసీ మంత్రులు(BC Ministers) సమావేశం అయ్యారు. తుది విచారణ ఉన్న నేపథ్యంలో.. రేపు హైకోర్టు(Telangana High Court)లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. కచ్చితంగా కోర్టు తీర్పు ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ఉంటుందని మంత్రులు నమ్ముతున్నారు. దాంటోపాటు ఇవాళ్టి వాదనలపై కూడా మంత్రులు రివ్యూ నిర్వహిస్తున్నారు. పిటిషనర్ల లాయర్లకు ధీటుగా వాదనలు వినిపించారని అభినందించారు.

మరోవైపు.. ఇవాళ సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు.. విచారణను గురువారానికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ జారీపై స్టే ఇవ్వాలని పిటిషన్‌ కోరారు. పిటిషనర్‌ విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం రేపు తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.

Next Story