- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఇవాళ కాలేజీల బంద్ !
విద్యార్థులకు బిగ్ అలర్ట్..ఇవాళ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ కాలేజీల బంద్ కు పిలుపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పెండింగ్ బకాయిలు చెల్లించాలంటూ బీసీ జేఏసీ ఇవాళ కాలేజీల బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు ప్రైవేట్ డిగ్రీ కాలేజీ అసోసియేషన్, తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్ట్యూషన్స్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించడం గమనార్హం.
దీంతో తెలంగాణ రాష్ట్రంలోని చాలా కాలేజీలు ఇవాళ బంద్ కానున్నాయి. ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ జూజల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నో రోజులుగా బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయని.. దీని వల్ల కాలేజీలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. అందరినీ దృష్టిలో పెట్టుకొని పెండింగ్ బకాయిలను రిలీజ్ చేయాలని కోరారు.
ఈ నెల 10వ తేదీన కూడా స్కూళ్లు, కాలేజీల బంద్
విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో జులై 10వ తేదీన కూడా విద్యా సంస్థలు మూతపడనున్నాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాలు పోస్టర్ ను కూడా ఆవిష్కరించాయి.






