- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్, కేటీఆర్ లపై ఏసీబీలో ఫిర్యాదు.. కేసు నమోదు..?
ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజు టెండర్లు, కైటెక్స్ గార్మెంట్స్ యూనిట్ల ఏర్పాటులో భారీగా అవినీతి జరిగినా పట్టించుకోరా.? అని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు.

దిశ, ఖైరతాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు టోల్ లీజు టెండర్లు, కైటెక్స్ గార్మెంట్స్ యూనిట్ల ఏర్పాటులో భారీగా అవినీతి జరిగినా పట్టించుకోరా.? అని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రశ్నించారు. ఈమేరకు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)డీజీని కలిసి కేసీఆర్, కేటీఆర్ లతో పాటు బీఆర్ఎస్ కు చెందిన ఇతర ముఖ్యనేతలపై వెంటనే కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరపాలని ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన ఏసీబీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఔటర్ టోల్ టెండర్ పొందిన ఐఆర్బీ ఇన్ ఫ్రా సంస్థ నుంచి, కైటెక్స్ గార్మెంట్స్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పెద్ద మొత్తంలో నిధులు అందాయని ఆరోపణలు చేశారు.. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. క్విడ్ ప్రోకోకు పాల్పడటం ద్వారా అధికారాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. ఐఆర్బి ఇన్ ఫ్రా సంస్థకు 30 ఏళ్లపాటు ఔటర్ టోల్ వసూళ్లను అప్పగించడం పెద్ద కుంభకోణం అని, ఇందులో రూ.7,380 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు..
నిర్వహణ ఖర్చు ఎక్కువ అయ్యే ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలో ఉంచి, ఆదాయం వచ్చే మార్గాన్ని ఐఆర్బీ ఇన్ ఫ్రా సంస్థకు కట్టబెట్టారని తెలిపారు. 2023 ఏప్రిల్ 27న ఐఆర్బీకి ఔటర్ టోల్ కాంట్రాక్ట్ దక్కితే.. 2023 జూలై 4న ఐఆర్బీ సంస్థ రూ.25 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీఆ ర్ఎస్ పార్టీకి ఇచ్చిందని, వారం రోజుల్లోనే ఆ డబ్బును బీఆర్ఎస్ విత్ డ్రా చేసుకుందని వివరించారు. తద్వారా క్విడ్ ప్రోకో చోటుచేసుకుందని పేర్కొన్నారు. వరంగల్, రంగారెడ్డి జిల్లాలో కైటెక్స్ గార్మెంట్స్ యూనిట్ల ఏర్పాటు విషయంలోనూ ఇలాగే క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. 2023 జూన్ 16న వరంగల్ కైటెక్స్ కంపెనీ రూ.15 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొంటే.. మర్నాడే బీఆర్ఎస్ పార్టీ వాటిని ఎన్ క్యాష్ చేసుకుందని వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లాలోనూ కైటెక్స్ కంపెనీ 2023 సెప్టెంబరు 12న రూ.10 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వగా, అక్టోబరు 16న ఆపార్టీ వీటిని ఎన్ క్యాష్ చేసుకుందని చెప్పారు..అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసిన కేసీఆర్, కేటీఆర్ పై వెంటనే కేసులు నమోదు చేసి త్వరితగతిన విచారణ జరిపి అరెస్ట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గోటూరి రవీందర్ గౌడ్, వనపర్తి జిల్లా ఉపాధ్యక్షులు గూడుషా, వనపర్తి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, కొత్తకోట మండల అధ్యక్షులు అంజన్న యాదవ్, ఆర్టీఐ విభాగం ఉపాధ్యక్షులు రాఘవేందర్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రేనట్ల మల్లేష్ ,చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల వినోద్ సాగర్, మ్యాదరి రాజ, నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.






