HYD: బీసీ చేతి వృత్తుల ఎగ్జిబిషన్

by Gantepaka Srikanth |

బీసీ సంక్షేమశాఖ చరిత్రలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన బీసీ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

HYD: బీసీ చేతి వృత్తుల ఎగ్జిబిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ సంక్షేమశాఖ చరిత్రలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన బీసీ చేతివృత్తుల కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. గురువారం ఉన్నతాధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సంఘాల నాయకులు సందర్శించారు. బీసీ చేతివృత్తులవారికి చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ బాగుందని ప్రశంసించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కే.పుష్పలీల, ఇంటలిజెన్స్ డీఐజీ బి.సుమతి, ఐపీఎస్, బీసీ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ పద్మ, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బీఎస్ రాములు, మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చింతల నిర్మలా రెడ్డి తదితరులు బీసీ చేతివృత్తుల ప్రదర్శనకు విచ్చేశారు.

Next Story