Ponnam: వారి ట్రాప్‍లో పడకండి.. బీసీ సంఘాలకు మంత్రి పొన్నం కీలక విజ్ఞప్తి

by Prasad Jukanti |   (  Updated:2025-11-27 10:20:12  IST  )

బీసీల రిజర్వేషన్లపై బీఆర్ఎస్, బీజేపీలకు మాట్లాడే అర్హత లేదని మంత్రి పొన్నం దుయ్యబట్టారు.

Ponnam: వారి ట్రాప్‍లో పడకండి.. బీసీ సంఘాలకు మంత్రి పొన్నం కీలక విజ్ఞప్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత విపక్షాలకు ఉందా? అసలు విపక్ష పార్టీలకు చరిత్ర తెలుసా అని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని ఇందుకు బీజేపీ సహకరించలేదని ధ్వజమెత్తారు. ఇవాళ గాంధీ భవన్‍లో (Gandhi Bhavan) మీడియాతో మాట్లాడిన పొన్నం.. బీఆర్ఎస్, బీజేపీ బీసీ రిజర్వేషన్లపై (BC Reservations) మొసలు కన్నీరు కారుస్తున్నాయని బలహీనవర్గాల ద్రోహులు బీఆర్ఎస్ (BJP), బీజేపీ (BRS)అన్నారు. బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు శాతాలపై పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులు తప్పకుండా అధికారికంగా వివరణ ఇస్తారన్నారు.

అదే జరిగి ఉండి ఉంటే గంటలో రిజర్వేషన్లు:

కాంగ్రెస్ రిజర్వేషన్ల పక్షపాత పార్టీ అయితే బీజేపీ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న పార్టీ అని పొన్నం ధ్వజమెత్తారు. ఇక బీఆర్ఎస్ అగ్రనేతలు కులణగణలో కూడా పాల్గనలేదని మండిపడ్డారు. మీరా మమ్మల్నీ ప్రశ్నించేదని దుయ్యబట్టారు. మేము బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పుడు కేంద్ర, రాష్ట్రాల్లో తామే అధికారంలోకి వస్తామని భావించామని అలా జరగలేదన్నారు. ఒక వేళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే గంటలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కేవన్నారు.

రాజకీయ ట్రాప్‍లో పడకండి:

బీసీ సంఘాల ఆకాంక్షలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, మీ ఆకాంక్షల్లో మేమూ భాగస్వామ్యులమేనన్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల విషయంలో అడ్డంకులు సృష్టిస్తున్నది ఎవరు? ప్రభుత్వం తరఫున ఏదైనా లోపాలు ఉంటే చూపించండి అన్నారు.బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకే రెండేళ్లుగా ఎన్నికలు వాయిదా వేశాం. ఎన్నికలు జరకపోవడంతో నిధులు ఆగిపోయాన్నారు. పంచాయితీ ఎన్నికలు పార్టీ పరంగా కూడా జరగవని స్థానిక బలంతోనే ఈ ఎన్నికల్లో గెలుస్తారని కాబట్టి ఈ విషయాన్ని బీసీ సంఘాల నాయకులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీల ట్రాప్‍లో బీసీ సంఘాలు పడొద్దని కోరారు.

బండి సంజయ్ మాట సాగుతోందా?:

బలహీన వర్గాల బిడ్డ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. బీసీ బిల్లు కేంద్రంలో పెండింగ్ లో ఉంది. దాన్ని ఆయన ఆమోదింప చేయించాలన్నారు. బండి సంజయ్ మాటను కిషన్ రెడ్డి, కేటీఆర్ సాగిస్తున్నారా? మీకు హిందుత్వం కావాలి కదా? ఈ 42 శాతంలో హిందువులు ఉన్నారని వాళ్ల కొరకైనా ఏదైనా చేయగలిగితే చేయాలన్నారు.

Next Story