Telangana CM : త్వరలో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి!

by Muthe.Rajitha |

రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీఎం కుర్చీపై కాంగ్రెస్ కీలక జాతీయ నాయకుడు క్లారిటీ ఇచ్చాడు.

Telangana CM : త్వరలో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రానికి త్వరలో బీసీ వ్యక్తి సీఎం(BC CM) అవుతారని కాంగ్రెస్ కీలక జాతీయ నాయకుడు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతానికి సీఎం పదవిలో ఎలాంటి మార్పు ఉండబోదని.. భవిష్యత్తులో పలాయన అంతా బీసీలదే అన్నారు ఏఐసీసీ(AICC) ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షులు అజయ్ సింగ్ యాదవ్(Ajay Singh). తెలంగాణలో చేపట్టిన కులగణన(Cast Census) దేశంలోని అన్ని రాష్ట్రాలకు కనువిప్పు కలుగుతుందని.. ఇదొక గేమ్ చేంజర్ గా ఉండబోతుందని అన్నారు. దేశంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నత స్థానాల్లో ఓబీసీలు లేరని.. ఆయా పోస్టుల్లో ఉన్నత కులాల వారే ఉన్నారని తెలిపారు. దేశంలో 1 శాతం జనాభా ఉన్న ఉన్నత కులాల వారే 40 శాతం దేశ సంపద ఉందన్నారు. అన్ని భారీ పరిశ్రమలు వారి చేతుల్లోనే ఉన్నాయని.. వీటిని ఎలాగైనా దేశంలోని అన్ని కులాల వారికి అందజేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు.

తెలంగాణ త్వరలో తీసుకురానున్న బీసీ రిజర్వేషన్ల బిల్లు(BC reservation Bill)ను 9వ షెడ్యూల్ లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న తెలంగాణ రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో 46 శాతం రిజర్వేషన్లు బీసీలకు, 10 శాతం మైనార్టీలకు అందజేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని బీజేపీ ప్రచారం చేస్తోందని.. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ వారి పిల్లలను ముస్లింలకు ఇచ్చి వివాహం జరిపించారని గుర్తు చేశారు. దేశంలో బలహీనుల వైపు కాంగ్రెస్ నిలబడుతుందని అజయ్ సింగ్ స్పష్టం చేశారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు 1993 లో మండల్ కమిషన్ తీసుకు వచ్చామని.. ఓబీసీలకు తాము ఎన్నడూ వ్యతిరేకం కాదని.. మేమ ప్రోబీసీ అని చమక్కులు విసిరారు. రానున్న నాలుగేళ్ళు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని ఆయన తేల్చి చెప్పారు.

Next Story