- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో పెట్టాలి.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
బీసీ రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill)ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ పెట్టాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు (C Hanumantha Rao) డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ బిల్లు (BC Reservation Bill)ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ పెట్టాల్సిందేనని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు (C Hanumantha Rao) డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) నాడు పాదయాత్రలో స్పష్టంగా ప్రకటించారని పేర్కొన్నారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శక్తి వంచన లేకుండా బీసీ రిజర్వేషన్ల అమలుకు కృషి చేశారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బీసీ బిల్లును ఆమోదించి రాజ్యంగంలోని 9వ షెడ్యూల్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు సమష్టిగా ఇదే అంశంపై మాట్లాడాలన విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఐఐటీ, ఐఐఎం విషయంలో తాను గతంలో సోనియాగాంధీని కోరితే అప్పుడే అమలు అయిందని తెలిపారు. బీజేపీ నాయకులు, ఎంపీలు అంతా కలిసి ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi)తో మాట్లాడి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలన్నారు వీ హనుమంతరావు సూచించారు.






