R Krishnaiah: ముగిసిన బీసీ బంద్ కార్యక్రమం.. ఆర్. కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకై నిర్వహించిన బీసీ బంద్ కార్యక్రమం విజయవంతం అయిందని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు.

R Krishnaiah: ముగిసిన బీసీ బంద్ కార్యక్రమం.. ఆర్. కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల (BC Reservations) సాధనకై నిర్వహించిన బీసీ బంద్ (BC Bandh) కార్యక్రమం విజయవంతం అయిందని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) తెలిపారు. శనివారం బీసీ బంద్ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు, ఆర్టీసీ, వ్యాపార సంస్థలు పూర్తిగా బంద్ చేసి మద్దతు ప్రకటించారని తెలిపారు. బీసీ బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని వెల్లడించారు. రాజకీయంగా విబేదాలు ఉన్నా.. అది పక్కన పెట్టి బీసీల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, టీజేఎస్‌తో పాటు అనేక మంది ప్రముఖులు కల్వకుంట్ల కవిత, మందకృష్ణ మాదిగ, విశారాధన్ మహారాజ్, కుల సంఘాలు, లాయర్లు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారని వివరించారు. ఈ సందర్భంగా బీసీల డిమాండ్ న్యాయమని మద్దతిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. బీసీ కులాలకు గౌరవం, పేదరిక నిర్మూలన కోసం పోరాటం చేస్తున్నామని, 42 శాతం బీసీ రిజర్వేషన్‌పై న్యాయ వ్యవస్థలు దిగివస్తాయని నమ్ముతున్నామని ఆకాంక్షించారు.

Next Story