- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bayya sunny yadav: కొడుకు కోసం భయ్యా సన్నీయాదవ్ పేరెంట్స్ కీలక నిర్ణయం
తమ కొడుకు కోసం యూట్యూబర్ సన్నీయాదవ్ పేరెంట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు వారు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తమ కొడుకు కోసం యూట్యూబర్ సన్నీయాదవ్ పేరెంట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసేందుకు వారు సిద్ధమవుతున్నట్టు సమాచారం. హెబియస్ కార్పస్ పిటిషన్‌ను చట్ట విరుద్ధంగా నిర్బందించినప్పుడు విడిపించడానికి వేస్తారు. ఈ పిటిషన్ ద్వారా నిర్భందించబడిన వ్యక్తిని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సన్నీయాదవ్‌ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సన్నీయాదవ్‌ను చెన్నైలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
నిన్న సన్నీయాదవ్ మరియు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను కలిసి ఎన్ఐఏ అధికారులు విచారించినట్టు సమాచారం. ఇటీవల పాకిస్థాన్‌లో సన్నీయాదవ్ బైక్ టూర్ చేయడం, భారత మోస్ట్ వాంటెడ్ జాకీర్ నాయక్ సభలో పాల్గొనడంతో పాటూ, అతడితో మాట్లాడటంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. రెండు నెలల పాకిస్థాన్ టూర్‌లో సన్నీయాదవ్ పర్యటించిన ప్రాంతాలు, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తుల గురించి కూడా ఎన్ఐఏ సన్నీని ప్రశ్నించిందట. ఇదిలా ఉంటే ఎన్ఐఏ సన్నీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ అధికారికంగా మాత్రం ఎక్కడా ఎన్ఐఏ ప్రకటించలేదు.






