- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతాం: భట్టి
ఏ నిబద్ధతతో అయితే విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పామో అదే నిబద్ధతతో చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని డిప్యూటీ

దిశ, వెబ్ డెస్క్: ఏ నిబద్ధతతో అయితే విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పామో అదే నిబద్ధతతో చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టానికి ఆమోదం తెలపాల్సిందే అని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదించుకుని రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. కుల గణన తర్వాత బీసీ రిజర్వేషన్లను బిల్లుగా మార్చి కేంద్రానికి పంపినట్టు చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ అంశం కాదని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంశం అని స్పష్టం చేశారు. రాష్ట్రపతి బిల్లును ఆమోదించాలని కోరారు. ఆమోదించడం ద్వారా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని బీసీలందరికీ సంక్షేమాన్ని అందిస్తామని సంకేతాన్ని ఇవ్వాలన్నారు. ఇండియాలోని అన్ని పార్టీలు తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ప్రకటిస్తున్నాయని చెప్పారు.






