- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bathukamma: విదేశాల్లో తెలంగాణ సంస్కృతి, వైభవం.. లూటన్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ సంస్కృతిక వైభవాన్ని చాటుతూ పలు దేశాల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని చాటుతూ పలు దేశాల్లో (Bathukamma celebrations) బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కెనడా, అమెరికా, ఖతర్, యూఏఈ, యూకే లాంటి పలు దేశాల్లోని తెలుగు ఎన్ఆర్ఐలు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూకేలోని లూటన్ పట్టణంలో నివసిస్తున్న తెలుగు ప్రజలు, (Luton Telugu Association) లూటన్ తెలుగు అసోసియేషన్ (ఎల్‌టీఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు సంప్రదాయ రీతిలో పేర్చి, పాటలతో, నృత్యాలతో ఆనందోత్సాహాలతో వేడుకలను కొనసాగించారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ, పూలను పూజిస్తూ, గౌరమ్మను ఆడబిడ్డలు ఆరాధించారు. ఇక, బతుకమ్మలను పేర్చిన వారందరికీ బహుమతులు అందజేయగా, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా లూటన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.
ఫోటోలు..






