- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral: అయ్యో సీతక్కా.. ఎంత పనైపోయింది? ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో ఘటన వైరల్
రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా (Indira Mahila Shakthi Scheme) ఇందిరా మహిళా శక్తి సంబురాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో వినూత్న కార్యక్రమాలతో మహిళా స్వయం సహాయక బృందాలు సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంతో ఇందిరా మహిళా శక్తి సంబురాలు (Bathukamma) బతుకమ్మ వేడులకు తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహిళా శక్తి వేడుకల్లో (Minister Seethakka) మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి సీతక్క తలపై నుంచి బతుకమ్మ కింద పడిపోయింది. గురువారం ములుగు జిల్లా గిరిజన భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికంగా మహిళా శక్తి వేడుకలను మంత్రి సీతక్క నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో మహిళలు బోనాలు, బతుకమ్మలతో మంత్రి సీతక్కకు స్వాగతం పలికారు. కూరగాయలతో పేర్చిన బతుకమ్మను మంత్రి సీతక్కకు ఇచ్చారు. ఈ క్రమంలోనే నెత్తి మీద పెట్టుకొని మంత్రి పోతుండగా.. కూరగాయలతో చేసిన బతుకమ్మ కావడంతో పేర్చిన కూరగాయలు ఒక్కసారిగా కిందకు పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట (Viral) వైరల్‌గా మారింది. అయ్యో సీతక్కా.. ఎంత పనైపోయిందని ఓ యూజర్ కామెంట్ హైలెట్‌గా నిలిచింది. పూలతో కాకుండా కూరగాయాలతో బతుకమ్మను పేర్చడం ఏమిటని, అందుకే ఈ విధంగా జరిగిందని పలువురు నెటిజన్‌లు కామెంట్స్ చేశారు.






