కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పెద్దఎత్తున హాజరైన ప్రవాస తెలుగు మహిళలు

by Ramesh Naini |

తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ కెనడాలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి.

కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పెద్దఎత్తున హాజరైన ప్రవాస తెలుగు మహిళలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: (Bathukamma celebrations) తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ (Canada) కెనడాలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి. (Telangana Development Forum) తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరమ్ కెనడా (టీడీఎఫ్) ఆధ్వర్యంలో (Toronto) టోరంటోలోని బ్రాంప్టన్ నగరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో ఎన్ఆర్ఐలు కుటుంబ సమేతంగా హాజరై, ఉల్లాసంగా ఆటపాటలతో బతుకమ్మను ఆడిపాడారు. తెలంగాణా డెవలప్‌మెంట్ ఫోరమ్, కెనడా నిర్వాహకులు ఈ వేడుకల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు, పసందైన తెలంగాణా వంటకాలతో భోజనాలను కూడా ఏర్పాటు చేశారు.

కెనడాలో పుట్టి పెరిగిన తెలుగు పిల్లలు తమ పండగల ప్రత్యేకతను తెలుసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని టీడీఎఫ్ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. 21 ఏళ్లుగా కెనడాలో బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించడానికి తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికీ టీడీఎఫ్ కెనడా కమిటీ ధన్యవాదాలు తెలిపింది.

విశేష పురస్కారం ప్రదానం..

ఈ కార్యక్రమ వేదికపై గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని మహేష్ మాదాడి, రజిని దంపతులకు టీడీఫ్ కెనడా కమిటీ తరఫున అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది, అమితా రెడ్డి, టీడీఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలు ముగింపు సందర్భంగా టీడీఎఫ్ కెనడా కమిటీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపింది.

Next Story