- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో రేపటినుంచి బతుకమ్మ సంబురాలు షురూ
ఆడబిడ్డల ఆత్మగౌరవ అడ్డ.. ఓరుగల్లు గడ్డ మీద రేపటి(ఆదివారం) నుంచి బతుకమ్మ సంబురాలు షురూ కానున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆడబిడ్డల ఆత్మగౌరవ అడ్డ.. ఓరుగల్లు గడ్డ మీద రేపటి(ఆదివారం) నుంచి బతుకమ్మ సంబురాలు షురూ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) వరంగల్ పట్టణంలోని వెయ్యి స్తంభాల గుడిలో ప్రారంభం అవనున్నాయి. అయితే, ఆరంభ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ(Konda Surekha) శనివారం ఒక ప్రకటన విడుదల చేసి.. రాష్ట్ర మహిళలకు చిన్న బతుకమ్మ వేడుకల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఐక్యత స్ఫూర్తిని చాటేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందిందన్నారు.
చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేసిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇదే విషయమై ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో సన్నాహాక సమావేశం ఏర్పాటు చేసి, అన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతుందని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.






