- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: తెలంగాణ తల్లి చేతుల్లోకి మళ్లీ బతుకుమ్మ రావాలి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ప్రతీ పథకం వెనుక ఆడబిడ్డల క్షేమం ఉందని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన ప్రతీ పథకం వెనుక ఆడబిడ్డల క్షేమం ఉందని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సీడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మహిళా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను కేసీఆర్ గొప్పగా నిర్వహించారని.. ఈ సారి మూడు బతుకమ్మ పాటలు ప్రత్యేకంగా రాయించామని తెలిపారు. పండుగకు కేసీఆర్ ఆడబిడ్డలకు చీరలు కానుక ఇచ్చారని.. ఆదివాసులు కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నారని చెప్పారు. లంబాడీలు తీజ్ పండుగ ఘనంగా జరుపుకుంటారని.. కానీ ఇప్పుడు బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు. పేద, గొప్ప, కులాలకు అతీతంగా బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవాలక్ష్మి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి సత్యవతి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.






