- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లపై వదంతులు నమ్మొద్దు: బస్తర్ ఐజీ సుందర్ రాజ్
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు గత నాలుగు రోజులుగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసులు గత నాలుగు రోజులుగా విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్లు, కూంబింగ్‌కు సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో తాజాగా బస్తర్ ఐజీ సుందర్ రాజ్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బస్తర్ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం భద్రతా దళాలు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలో నక్సల్ నిర్మూలన కోసం నిరంతరం ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్న భద్రతా బలగాల ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో, ఆపరేషన్లు పూర్తికాకముందే వాటికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయడం ఇకనుంచి కుదరదు. ఆపరేషన్లను గోప్యంగా ఉంచడంతో పాటు, భద్రతా బలగాలను కాపాడుకోవడం కూడా చాలా అవసరం. ఇకనుంచి ఏదైనా కీలక పరిణామాలు ఉంటే.. తామే స్వయంగా ప్రకటనలు చేస్తాం.. అప్పటివరకు ఎవరూ అనధికారిక వార్తలను ప్రసారం చేయవద్దు. వదంతులను ప్రజలు నమ్మొద్దు’ అని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ విజ్ఞప్తి చేశారు.






