Barsa Deva: కరీంనగర్‍లో బార్సె దేవా.. సరెండర్‍కు ముందు నెలన్నర రోజులు ఇక్కడే మకాం

by Prasad Jukanti |   (  Updated:2026-01-07 09:52:18  IST  )

ఆపరేషన్ కగార్‍తో మావోయిస్టు కీలక నేతలు తమ మకాం తెలంగాణకు మార్చారా? తాజాగా బర్సె దేవా సరెండర్ విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Barsa Deva: కరీంనగర్‍లో బార్సె దేవా.. సరెండర్‍కు ముందు నెలన్నర రోజులు ఇక్కడే మకాం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వరుస లొంగుబాట్లతో సతమతం అవుతున్న మావోయిస్టు పార్టీకి ఇటీవల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‍జీఏ) బెటాలియన్ వన్ కమాండర్ (PLGA Battalion 1 Commander) బార్సె దేవా అలియాస్ సుక్క సరెండర్ (Barse Deva Surrender) బిగ్ షాక్‍గా మారింది. ఈ నెల 3వ తేదీన తెలంగాణ డీజీపీ ఎదుట దేవాతో పాటు మొత్తం 20 మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. అయితే దేవా లొంగిపోవడానికి ముందు జరిగిన పరిణామాలు ఇప్పుడు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా ఆయన తన సరెండర్ వెనుక మరో బిగ్ బ్లాస్టింగ్ విషయాన్ని బహిర్గతం చేశారు. తాను లొంగిపోవడానికి ముందు కరీంనగర్‍లోనే గడిపినట్లు దేవా సంచలన విషయాన్ని వెల్లడించారు. కరీంనగర్ (Karimnagar) నుంచి మరో చోటకు వాహనంలో తన సహచరులతో కలిసి వెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో దొరికిపోయామని తాజాగా ఓ హిందీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్ ది రికార్డులో దేవా వెల్లడించారు.

కర్రిగుట్ట ఆపరేషన్స్ తో కరీంనగర్‍కు:

ఆపరేషన్ కర్రిగుట్టల (Operation Karrigutta) సమయంలో ఛత్తీస్ గఢ్‍ను వీడి తెలంగాణకు వచ్చానని దేవా తెలిపారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా గతేడాది తెలంగాణ, చత్తీస్ గఢ్ (Chhattisgarh) సరిహద్దులను ఆనుకుని ఉన్న కర్రిగుట్టలో కేంద్ర భద్రతాబలగాలు ఆపరేషన్ కర్రిగుట్టల పేరుతో భారీ సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించిన సంగతితెలిసిందే. ఈ ఆపరేషన్ సమయంలో పెద్దఎత్తున మావోయిస్టులు తప్పించుకుని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. ఆ సమయంలో గతేడాది అక్టోబర్ నెలలో తాను కరీంనగర్ కు వచ్చానని అక్కడ దాదాపు నెలన్నర నుంచి రెండు నెలల పాటు కరీంనగర్ పట్టణం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తలదాచుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో స్కార్పియో వాహనంలో తన సహచరులతో కలిసి లొకేషన్ చేంజ్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డానని ఆ తర్వాత పోలీసులు కొన్ని షరతులతో సరెండర్‍గా చూపించారని చెప్పుకొచ్చారు.

ఇంత పెద్ద ఆపరేషన్ ఊహించలేదు:

గతేడాది ఏప్రిల్‍లో కర్రిగుట్ట ప్రాంతంలో పెద్ద ఆపరేషన్ జరుగుతుందని మేము ఊహించాం. కానీ అది ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే ఉంటుదని అనుకున్నామని దేవా చెప్పారు. అంత పెద్ద స్థాయి ఆపరేషన్ జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం సుమారు 6:30 గంటల నుంచి దాడి ప్రారంభమైంది. ఆ నెల చివరి వరకు మొత్తం ఆపరేషన్ కర్రిగుట్ట ప్రాంతం మీదే కొనసాగింది. ఇది చాలా దీర్ఘకాలిక దాడి అని అర్థమయ్యాక మేము అక్కడ ఉండటం సురక్షితం కాదని భావించామని దాంతో టీమ్‍లుగా విడిపోయి అక్కడున్న మావోయిస్టులను ఒక్కొక్కరిని వేర్వేరు దారుల్లో బయటకు తీసుకెళ్లామన్నారు. అలా అందరూ అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పెద్ద నేతలందరూ కూడా క్షేమంగా బయటకు వెళ్లిపోయారు. కర్రిగుట్ట ఆపరేషన్ లో మా వెంట ఉన్న 37 మంది సహచరులు మాత్రం ఆ ఆపరేషన్‌లో మరణించారని వెల్లడించారు. మీ సరెండర్ సమయంలో విదేశీ ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. విదేశాల నుంచి మీకు ఆయుధాలు వస్తున్నాయన్న ఆరోపణలు నిజమా? అని మీడియా అడిగిన ప్రశ్నకు విదేశాల నుంచి మాకు ఆయుధాలు వస్తాయన్న ఆరోపణలు పూర్తిగా తప్పు అని దేవా చెప్పారు. మాకు ఎలాంటి విదేశీ ఆయుధ సరఫరా జరగదని స్పష్టం చేశారు.

Next Story