Bar Council elections: బార్ కౌన్సిల్ ఎన్నికల హోరు.. జోరుగా కొనసాగుతున్న ప్రచారం

by Ramesh Naini |

తెలంగాణ హైకోర్టులో త్వరలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల హోరు నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా న్యాయవాదులు ప్రచారం నిర్వహిస్తున్నారు.

Bar Council elections: బార్ కౌన్సిల్ ఎన్నికల హోరు.. జోరుగా కొనసాగుతున్న ప్రచారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ హైకోర్టులో త్వరలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల హోరు నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా న్యాయవాదులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో న్యాయవాది రోహిత్ పాల్ సింగ్ ప్రభంజనం కొనసాగుతోంది. యువ న్యాయవాదిగా తను ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు వేరొక న్యాయవాది ఎదుర్కో వద్దు అని న్యాయవాది రోహిత్ అన్నారు.

యువ న్యాయవాదులకు ప్రోత్సాహం..

యువ న్యాయవాదులకు ప్రభుత్వం తరపున ప్రోత్సాహం లభించాలని గట్టిగా పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని, తన జీవితం న్యాయవాదుల సేవకు అంకితం చేస్తానని తెలిపారు. వివిధ జిల్లాల పర్యటనలో యువ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను నిశితంగా పరిశీలించినట్లు వెల్లడించారు. వారికి తగిన ప్రభుత్వం, బార్ అసోసియేషన్ తరపున వచ్చే ప్రోత్సాహకాల గురించి అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. బార్ కౌన్సిల్‌లో యువత గళం కావాలంటే ఇదే సమయం.. బార్ కౌ‌న్సిల్ ఎన్నికల్లో యువ న్యాయవాదులు తప్పని సరి పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకొని పిలుపునిచ్చాడు.

కాగా, ఐదేండ్లకు ఒకసారి జరిగే తెలంగాణ హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు జనవరి 30న జరగనున్నాయి. 25 మంది సభ్యులను ఎన్నుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 56 వేల మంది న్యాయవాదులు ఓటు వేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహిళలకు 30 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ఐదుగురు మహిళా సభ్యులను ఎన్నుకోనున్నారు.

Next Story