చూస్తూ ఉండండి గాంధీ విగ్రహం విషయంలో అదే జరుగుతుంది.. యూట్యూబర్ అన్వేష్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-02-26 10:21:57  IST  )

హైదరాబాద్‍లో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన గాంధీ విగ్రహనిర్మాణానికి యూట్యూబర్ అన్వేష్ మద్దతు తెలిపారు.

చూస్తూ ఉండండి గాంధీ విగ్రహం విషయంలో అదే జరుగుతుంది.. యూట్యూబర్ అన్వేష్  సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ లో (Musi Riverfront Project) భాగంగా తెలంగాణ సర్కార్ నిర్మించదలచిన గాంధీ విగ్రహం (Hyderabad Gandhi Statue) ఇప్పుడు తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఈ విగ్రహం ఏర్పాటు వద్దంటూ స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (Anvesh) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. హైదరాబాద్‍లో ప్రపంచంలోనే ఎత్తైనా గాంధీ విగ్రహం నిర్మిస్తే ఇది గుజారాత్‌లోని 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' తరహాలో ఇది భారీ పర్యాటక ఆదాయం, ఉపాధిని తెస్తుందని థాయిలాండ్ పర్యాటక రంగంలాగే, ఈ ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి తోడ్పడనుందని చెప్పారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

మన వద్ద రాజకీయ కుట్ర:

హైదరాబాద్‍లో టూరిజం పెంపొందించేందుకు ఎత్తైన నిర్మాణాలు చేపడితే అందులో పెద్ద ఎత్తున రాజకీయ కుట్ర జరుగుతదని, మనకు అభివృద్ధి వద్దనని అన్వేష్ అన్నారు. నేను ఏ పార్టీకి సపోర్టు కాదు. కేటీఆర్ కేసీఆర్ విగ్రహం నిర్మించినా నేను కేటీఆర్‍కు మద్దతు ఇస్తాను. అభివృద్ధి, టూరిజానికి ఎప్పుడు నా మద్దతు ఉంటుందన్నారు. గుజరాత్‍లో పటేల్ విగ్రహాన్ని రూ.3 వేల కోట్ల వ్యయంతో బీజేపీ ప్రభుత్వం నిర్మించ తలపెడితే అప్పుడు కాంగ్రెస్ విమర్శించిందని ఆ డబ్బుతో రోడ్లు, స్కూళ్లు, ఆసుపత్రి వంటి మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు కదా అని మాట్లాడారని అన్నారు. కానీ అక్కడ విగ్రహం నిర్మించాక ఇప్పటి వరకు 8 వందల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు గాంధీ విగ్రహాన్ని రూ.5 వేల కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‍లో నిర్మించబోతోందని హెచ్‍సీయూ భూముల విషయంలో పర్యావరణం పేరుతో అడ్డుకున్నట్లు ఇక్కడా ఆపడానికి కుదరదన్నారు.

ఎవరు వద్దన్నా ఆయన విగ్రహం నిర్మిస్తారు:

టూరిజం పవర్ ఏంటో తనకు తెలుసని అన్వేష్ అన్నారు. ముప్పై ఏళ్ల క్రితం థాయ్‍లాండ్‍లో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు అక్కడ లాభాలు వస్తున్నాయని గతేడాది రూ.7 లక్షల కోట్ల ఆదాయం రాగ ఈ ఏడాది రూ.9 లక్షల కోట్ల ఆదాయం టార్గెట్‍గా పెట్టుకుందని ఇప్పుడు అక్కడి ప్రభుత్వానికి కూర్చున్నా ఆదాయం వస్తోందన్నారు. 150 దేశాలు అభివృద్ధి చెందడానికి, అభివృద్ధి జరగాలంటే నదులు, కొండలు, ఇళ్ల ధ్వంసం తప్పదన్నారు. ఇవేవి జరగకుండా అభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రపంచంలో ఎక్కడా మౌళిక సదుపాయాలు ఏర్పాటు చేసి టూరిజం అభివృద్ధి చేయరు. మొదట టూరిజం స్పాట్ డెవలప్ చేసి ఆ తర్వాత ఆ చుట్టుపక్కల అభివృద్ధి చేస్తారన్నారు. మీరు చూస్తూ ఉండండి ఎవరు వద్దన్నా గాంధీ విగ్రహాన్ని హైదరాబాద్‍లో రేవంత్ రెడ్డి నిర్మిస్తారని దాన్ని ఎవరూ ఆపలేరన్నారని చెప్పారు. అడ్డుకునే వారు అరిచి అరిచి సైలెంట్ అయిపోతారని వ్యాఖ్యానించారు. భవిష్యత్‍‍లో ఏపీలో ఎన్టీఆర్ విగ్రహం నిర్మించినా తాను సపోర్టు చేస్తానన్నారు. నేను పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అభివృద్ధి చేస్తానంటే ముందు వచ్చి మద్దతు ఇస్తానన్నారు. అయితే తాను కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా, వారి ఇండ్లు కూల్చకుండా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.

Next Story