బీజేపీ ఎదుగుదల ఓర్వలేక ఈటలపై బ్యానర్లు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Kema Shiva Kumar |

ఎంపీ ఈటల రాజేందర్‌ను కించపరుస్తూ ఏర్పాటు చేసిన బ్యానర్లపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

బీజేపీ ఎదుగుదల ఓర్వలేక ఈటలపై బ్యానర్లు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్‌ను కించపరిచే విధంగా ఏర్పాటు చేసిన బ్యానర్లను తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో ఖండిస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇది ఓ నాయకుడిపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, తెలంగాణ బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న ప్రత్యర్థి రాజకీయ శక్తుల అసురక్షిత భావానికి నిదర్శనమన్నారు. ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఓ ప్రకటనలో పేర్కొంటూ.. ఈటల దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడని కొనియాడారు. ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నేత అని, అలాంటి వ్యక్తిని కించపరిచే ప్రయత్నం చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ఠ అని మండిపడ్డారు. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేని అధికార పార్టీతో పాటు ఇతర ప్రత్యర్థి శక్తుల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ పూర్తిగా ఐక్యంగా ఉందని, ఇలాంటి కుట్రలు బీజేపీ ఐక్యతను దెబ్బతీయలేవని, తెలంగాణ ప్రజలు నిజాలను గమనిస్తున్నారని ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

Next Story