గిరిజనుల మధ్య అపోహలు.. నిజ నిర్ధారణ కమిషన్ వేయాలి.. డీజీపీకి బంజారా మహా సేవా సంఘం విజ్ఞప్తి

by Ramesh Naini |

రాష్ట్రంలోని గోండు, కోయ, బంజారా లంబాడీ గిరిజనుల మధ్య నెలకొన్న అపోహాలు, అపార్థాలను తొలగించడానికి ప్రభుత్వ నిజనిర్ధారణ కమిషన్​నియమించి గిరిజనుల మధ్య విభేదాలు తొలగించాలి

గిరిజనుల మధ్య అపోహలు.. నిజ నిర్ధారణ కమిషన్ వేయాలి.. డీజీపీకి బంజారా మహా సేవా సంఘం విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గోండు, కోయ, బంజారా లంబాడీ గిరిజనుల మధ్య నెలకొన్న అపోహాలు, అపార్థాలను తొలగించడానికి ప్రభుత్వ నిజనిర్ధారణ కమిషన్​నియమించి గిరిజనుల మధ్య విభేదాలు తొలగించాలని బంజారా భారత్​ అఖిల భారతీయ బంజారా మహా సేవా సంఘం కోరింది. ఈ మేరకు సంఘం ​ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్​లో రాష్ట్ర డీజీపీ శివధర్​ రెడ్డి(Telangana DGP Shivdhar Reddy)కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ ధరావత్ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని సోషల్​ మీడియా, తదితర మాధ్యమాల్లో బంజారా లంబాడీలు గిరిజనులు కాదన్నట్లుగా చిత్రీకరించి గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. గిరిజనులకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లలో కేవలం 4 శాతమే అమలవుతుందని, పూర్తిగా అమలే కానప్పుడు బంజారా లంబాడీలు ఎక్కువ రిజర్వేషన్లు పొందుతున్నారంటూ కుట్ర చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల మధ్య సామరస్య సద్భావన నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిజనిర్ధారణ కమిషన్​ ఏర్పాటు చేయాలని రవీంద్ర నాయక్ ​విజ్ఙప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధిలో బంజారా లంబాడీలను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు.

Next Story