- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత.. బంజారా, గిరిజన సంఘం నాయకుల ధర్నా
ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద బంజారా జన సంఘం, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ధర్నాకు దిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ తెలంగాణ భవన్ (Delhi Telangana Bhavan) వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద బంజారా జన సంఘం, గిరిజన విద్యార్థి సంఘం నాయకులు ధర్నాకు దిగారు. ఆదివాసీలు, లంబాడీల మధ్య సీఎం రేవంత్ రెడ్డి చిచ్చు పెడుతున్నారని వారు ఆరోపించారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని తెలంగాణలో కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు.
ఎస్టీ జాబితా నుంచి లంబాడాలను తొలగించాలని కుట్ర చేస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, సోయం బాపూరావును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే మంత్రులు సీతక్క, పొంగులేటిపై కూడా చర్యలు తీసుకోవాలని నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఏఐసీసీ కార్యాలయం వద్ద ధర్నాకు వెళుతున్న బంజారా జన సంఘం, గిరిజన విద్యార్థి సంఘం నేతలను తెలంగాణ భవన్ వద్ద ఢిల్లీ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.






