Bandla Ganesh : ప్రాణం పోయినా.. కానీ బీఆర్ఎస్‌ను పొగడను.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Naini |

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Bandla Ganesh : ప్రాణం పోయినా.. కానీ బీఆర్ఎస్‌ను పొగడను.. బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీఆర్ఎస్ పార్టీపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రాన్ని శాసిస్తున్న బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికి ఎదురు తిరిగానని బండ్ల గణేష్ అన్నారు. ప్రాణం పోవడానికైనా సిద్దపడతా.. కానీ బీఆర్ఎస్‌ను పొగడనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నేను.. కాంగ్రెస్.. కాంగ్రెస్.. కాంగ్రెస్ (Congress) అంటూ చెప్పుకొచ్చారు. తాను 2000 సంవత్సరం నుంచి పార్టీకి సన్నిహితంగా ఉన్నట్లు తెలిపారు. తనకు ఇష్టమైన నటుడు చిరంజీవి పార్టీ పెట్టిన సమయంలో కూడా పార్టీ మారలేదన్నారు. అదేవిధంగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన కూడా పోలేదని, తనకు కాంగ్రెస్ పార్టీ అంటే అంత అభిమానమని చెప్పారు. మరోవైపు మన ఇండియాలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో బెస్ట్ సీఎం ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటికీ ఆయనకు మాత్రం ఆ ఆహం లేదన్నారు.

Next Story