బండ్ల గణేష్ గొప్ప మనసు.. పవన్ కల్యాణ్ అభిమానికి భారీ సాయం

by Prasad Jukanti |   (  Updated:2026-06-17 07:28:43  IST  )

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్‌కు టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ఆర్థిక సహాయం ప్రకటించారు.

బండ్ల గణేష్ గొప్ప మనసు.. పవన్ కల్యాణ్ అభిమానికి భారీ సాయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్ (17) కు ఆర్థిక సహాయం ప్రకటించాడు. పవన్ కల్యాణ్ భక్తుడిగా ఆయన స్పూర్తితో పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరపున నిరంజన్‍కు, అతని కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పరమేశ్వర ప్రొడక్షన్స్ పేరుతో ఇవాళ ఎక్స్ వేదికగా బండ్లగణేశ్ ఓ పోస్టు చేశారు. నిరంజన్ తీవ్రమైన కిడ్నీ సమస్యతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుండటం ఎంతో బాధాకరం అని చాలా కాలంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍ను కలవాలనే నిరంజన్ కోరిక నేడు నెరవేరబోతుండటం హృదయాన్ని కదిలించింది. మీడియా మిత్రుల సహకారంతో ఈ విషయం పవన్ కల్యాణ్ దృష్టికి చేరగా ఆయన స్వయంగా నిరంజన్ ను కలవడానికి హనుమకొండకు వస్తున్నారు. ఆయన స్పూర్తితో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, తన అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌ను కలవాలన్న కోరికను తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఇవాళ హనుమకొండకు వెళ్లారు. అక్కడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్‌ ను పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా అతడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

Next Story