ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి ఈవీ స్కూటర్ల హామీలా? సీఎంపై బండి ఫైర్

by Prasad Jukanti |

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. పేదలకు లేని భూములు వారికోసం ఎక్కడివని ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి ఈవీ స్కూటర్ల హామీలా? సీఎంపై బండి ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలోనే కాలేజీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు గుప్పించారు. సీఎం పూటకో మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. కానీ సీఎం మాత్రం ఉచిత ఈవీ స్కూటర్లు ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారని నిలదీశారు. అలాగే పేదలు, దళిత, గిరిజనులుక ఇవ్వడానికి భూములు లేవని చెబుతున్న అదే రేవంత్ రెడ్డి జర్నలిస్టులకు, మూసీ బాధితులకు భూములు ఇస్తామని చెబుతున్నారు. పెన్షన్లు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెబుతూనే ఓవైసీ ఒక్క పిలుపునిస్తే మూసీ ప్రాజెక్టు కోసం వేల కోట్లు ఏర్పాటు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఒక విషయం మాత్రం వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దోమల బెడత పెరిగిందని ప్రజలు చెబుతున్నారు. మన పని మనం చేసుకుంటున్నా దోమల మాదిరిగా కాంగ్రెస్ ఎక్కడినుంచో వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు.

సీఎం కీలక ప్రకటన:

కాగా నిన్న ప్రజా భవన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జర్నలిస్టులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు ఇస్తామన్నారు. అలాగే కాలేజీలకు వెళ్లే ఆడపిల్లలకు ఈవీ స్కూటీలు త్వరలో అందిస్తామని ప్రకటించారు.మూసీ నిర్వాసితులైన మధుపార్క్ అపార్ట్ మెంట్ వాసులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయంగా భూమి, భవన నిర్మాణాలకు నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే ఇటీవల పలు వేదికలపై సీఎం మాట్లాడుతూ పంచిపెట్టేందుకు ప్రభుత్వం వద్ద భూములు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎక్స్ వేదికగా స్పందించిన బండి సంజయ్ సీఎం మాటలు మారుస్తున్నారంటూ దుయ్యబట్టారు.

Next Story