వారిని టచ్‌ చేస్తే.. బుల్డోజర్లతో రంగంలోకి దిగుతా: రేవంత్‌ సర్కార్‌కు బండి సంజయ్ హెచ్చరిక

by Gantepaka Srikanth |

గాంధీ విగ్రహం ఏర్పాటు పేరుతో పేదల ఇళ్లు కూల్చి వేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

వారిని టచ్‌ చేస్తే.. బుల్డోజర్లతో రంగంలోకి దిగుతా: రేవంత్‌ సర్కార్‌కు బండి సంజయ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: గాంధీ విగ్రహం ఏర్పాటు పేరుతో పేదల ఇళ్లు కూల్చి వేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే.. పెద్దల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తామని బండి సంజయ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. గతంలో అసదుద్దీన్ ఒవైసీ కాలేజీలు కూల్చడానికి విద్యార్థులకు పరీక్షలు ఉన్నాయంటూ సాకు చెప్పారు. మరి ఖమ్మంలో కూల్చివేతలు చేసే సమయంలో ఇంటర్ విద్యార్థుల పరీక్షలు, వారి భవిష్యత్‌ గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. ఒవైసీ కళ్లలో ఆనందం కోసం హిందువులను జైల్లో వేస్తారా? అని తీవ్ర స్థాయిలో రెచ్చిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి హిందువులంతా ఏకమైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ఎవరూ బయట తిరగలేరని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం మొదలైంది. మూటల కోసం తెలంగాణకు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.

Next Story