TG: రేవంత్ ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయిస్‌ను అరెస్ట్‌ చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.

TG: రేవంత్ ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డని కలిసేందుకు అసెంబ్లీకి వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయిస్‌ను అరెస్ట్‌ చేయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ప్రకటన చేశారు. గోడు వెళ్లబోసుకుందామని వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులను అన్యాయంగా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. దశాబ్దాల తరబడి ప్రభుత్వానికి సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులను ఇబ్బంది పెడతారా? అని అడిగారు. కడుపుకట్టుకుని దాచుకున్న సొమ్మును ప్రభుత్వం చెల్లించాలని కోరడం కూడా తప్పేనా? అని అన్నారు. సకాలంలో బకాయిలివ్వకపోవడంతో ఇప్పటికే వందలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారు. వేలాది మంది ఉద్యోగులు అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లల పెళ్లిళ్లు, విద్యా అవసరాలు తీర్చలేక నానా అవస్థలు పడుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో దాదాపు 40 వేల మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ పడుతున్న బాధ వర్ణణాతీతం అని అన్నారు. ఆడంబరాలు, హంగుల కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. జీవితాంతం ప్రభుత్వానికి సేవ చేసిన ఉద్యోగులకు రూ.8 వేల కోట్లు చెల్లించడం లేదని మండిపడ్డారు. తక్షణమే రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలన్నీ చెల్లించాలి.. అరెస్ట్ చేసిన వారందరినీ వదిలిపెట్టాలి.. లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు అని బండి సంజయ్ హెచ్చరించారు.

Next Story