15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం.. రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్

by Gantepaka Srikanth |

తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు కాలేజీలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం.. రేవంత్ సర్కార్‌పై బండి సంజయ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో యాజమాన్యాలు కాలేజీలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS, కాంగ్రెస్‌(Congress) పాలన సేమ్.. ఇద్దరి పాలనతో ప్రజలకు, విద్యార్థులకు, రైతులకు, తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. మూసీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, మిస్ వరల్డ్ పోటీలకు వేల కోట్లు ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పేద విద్యార్థుల కోసం కనీసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేయలేదా? అని నిలదీశారు. కాంగ్రెస్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో 15 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతోందని మండిపడ్డారు. కాగా, ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ నగదు చెల్లించకపోవడంతో.. తెలంగాణ వ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Next Story