తల నరుక్కుంటా కానీ ఆ పనిమాత్రం చేయను.. జూబ్లీహిల్స్‌లో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

జూబ్లీహిల్స్ ప్రచారంలో బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి బోరబండలో మాట్లాడారు.

తల నరుక్కుంటా కానీ ఆ పనిమాత్రం చేయను.. జూబ్లీహిల్స్‌లో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ప్రచారంలో బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి బోరబండలో మాట్లాడారు. ఇవాళ బీజేపీ మీటింగ్‌కు పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ రద్దు చేశారు. అనుమతి ఇచ్చినా.. ఇవ్వకపోయినా ప్రచారానికి వస్తానని చెప్పా.. చెప్పినట్లే వచ్చానని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ గడీని బద్దలు కొట్టింది బీజేపీనే అని అన్నారు. ఎన్నికలు రాగానే ముస్లింల టోపీ పెట్టుకోవడం కాంగ్రెస్‌ నేతలకు అలవాటు అయిపోయిందని విమర్శించారు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా ముస్లిం టోపీ పెట్టుకోవడం, పాకిస్తాన్‌ను పొగడటం వంటివి చేస్తారని మండిపడ్డారు. తన వరకూ వస్తే.. తల అయినా నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ పెట్టుకొని మాత్రం ఓట్లు అడుక్కోను అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వస్తున్న సర్వేలన్నీ భోగస్ అని కొట్టిపారేశారు. మరోవైపు.. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని.. ఆ పార్టీకి ఓటు వేసి ఉపయోగం లేదని అన్నారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు వచ్చే ఓట్లతో శాశ్వతంగా ఫామ్‌హౌజ్‌కు పరిమితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Next Story