- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రమేశ్‌ను కరీంనగర్‌కు తీసుకొస్తా.. కేటీఆర్‌కు బండి సంజయ్ సంచలన సవాల్
కేటీఆర్(KTR), ఎంపీ సీఎం రమేశ్(CM Ramesh) పరస్పర విమర్శలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కేటీఆర్(KTR), ఎంపీ సీఎం రమేశ్(CM Ramesh) పరస్పర విమర్శలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రమేశ్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి సంబంధం లేదని స్పష్టం చేశారు. సీఎం రమేశ్‌ను కరీంనగర్‌కు తీసుకొచ్చే బాధ్యత నాది.. చర్చకు కేటీఆర్ సిద్ధమా? అని సవాల్ చేశారు. దమ్ముంటే టైమ్, డేట్‌ను కేటీఆర్ ఫిక్స్ చేయాలని అన్నారు. కేటీఆర్‌కు సీఎం రమేశ్ ఆర్థికసాయం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.. అయినా కూడా విశ్వాసం లేకుండా రమేశ్‌పై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో ఆ పార్టీలో ఎవరూ లేరని.. అందుకే బీజేపీలో విలీనం చేస్తామని గతంలో ఒప్పందానికి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అని.. అందుకే తిరస్కరించామని చెప్పారు.
కాగా, తెలంగాణలో సీఎం రమేశ్‌కు రేవంత్ రెడ్డి రూ.1660 కోట్ల నామినేషన్ వర్క్ ఇచ్చారని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రమేశ్.. కేటీఆర్‌పై మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై బురద జల్లాలని నాపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే కవిత జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో తన ఇంటికి వచ్చారని, కేసులు ఎత్తివేస్తే.. బీజేపీలో బీఆర్ఎస్‌లో విలీనం చేస్తామని కేటీఆర్ చెప్పారని సీఎం రమేశ్ హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. అనంతరం సీఎం రమేశ్ సవాల్‌కు తానూ సిద్ధమని కేటీఆర్ స్పందించారు. తాజాగా ఈ ఇష్యూలోకి బండి సంజయ్ ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో అని ఆసక్తిగా మారింది.






