ఆ సినిమా ఓటీటీలోకి వచ్చింది.. అందరూ చూడండి.. తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ పిలుపు

by Gantepaka Srikanth |
ఆ సినిమా ఓటీటీలోకి వచ్చింది.. అందరూ చూడండి.. తెలంగాణ ప్రజలకు బండి సంజయ్ పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: అనసూయ(Anasuya), బాబీ సింహా(Bobby Simha) కాంబినేషన్‌లో వచ్చిన రజాకార్ మూవీ(Razakar Movie) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. నిజాం ప్రభువుల నిరంకుశత్వాన్ని, రజాకార్ల అరాచకత్వాన్ని ఈ సినిమాలో కళ్లకి కట్టినట్లు చూపించారు. యాట సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. తెలంగాణ బీజేపీ నేత(Telangana BJP) గూడూరు నారాయణ రెడ్డి(Gudur Narayana Reddy) నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. శుక్రవారం నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు, బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ కీలక నేత, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక పిలుపునిచ్చారు. అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడాలని కోరారు.

1947లో దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినా.. హైదరాబాద్‌(Hyderabad)కు మాత్రం రాలేదన్న కథాంశాన్ని చాలా చక్కగా చూపించారు. ఆరోజుల్లో రజాకార్లు చేసిన దౌర్జన్యాలు, అరాచక చర్యలను అందరూ తప్పకుండా చూసి చరిత్ర తెలుసుకోవాలి. నిజాం ప్రభువు హైదరాబాద్‌ను తుర్కిస్తాన్‌(Turkistan)గా మార్చాలని ఎలా ప్రయత్నాలు చేశారో తెలుసుకోవాలని.. ఇది హిందువుల బాధ్యత అని బండి సంజయ్ గుర్తుచేశారు. హిందువులందరినీ ఇస్లాం మతంలోకి మార్పించేందుకు రజాకార్లు అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. క్రూరంగా హింసించారని.. అప్పటికీ వినకపోతే ప్రాణాలు సైతం తీశారని.. అలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కానీ మతం మారేందుకు ఇష్టపడలేదు అని తెలిపారు.

Next Story

Most Viewed