- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్కరిని కూడా వదిలిపెట్టం.. ఉగ్రదాడిపై బండి సంజయ్ రియాక్షన్
జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో జరిగిన ఉగ్రదాడిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ‘‘జమ్మూ& కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో అమాయక పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలా బాధించింది. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇటువంటి పిరికిపంద చర్యలు మా దృఢ సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయవు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం(Modi Govt), హోంశాఖ మంత్రి అమిత్ షా దృఢ నాయకత్వంలో, పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.
ఈ చర్య వెనుక ఉన్న వారిని ప్రభుత్వం వదిలిపెట్టదు. నేరస్థులు అత్యంత కఠినమైన పరిణామాలను ఎదుర్కొంటారు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కాల్పుల్లో మృతిచెందిన వారి సంఖ్య 27కు చేరింది. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాకారం. కశ్మీర్ టూరిస్టులపై కాల్పులు జరిపింది తామేనని టీఆర్ఎఫ్ సంస్థ ప్రకటించింది. మరోవైపు ఈ ఘటనపై ఆరా తీసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(PM Modi).. వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)కు కాల్ చేసి కాల్పులు జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశించారు.






