- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బండి సంజయ్ పట్టుదల ఫలించింది.. యూసీఎఫ్ జాబితాలో చోటు దక్కించుకున్న కరీంనగర్
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు యూసీఎఫ్ కింద 17 ప్రాజెక్టుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు యూసీఎఫ్ కింద 17 ప్రాజెక్టుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. ఈప్రాజెక్టుల విలువ రూ.14,867.88 కోట్లు ఉండగా వీటికి కేంద్రం ఆమోదం తెలిపింది. తెలంగాణ నుంచి మూడు ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పంపగా వాటికి ఆమోదం లభించింది. వీటిలో ఖమ్మం- వరంగల్- కరీంనగర్ కారిడార్.. తర్వాత వరంగల్ మురుగునీటి ఆధునీకరణ వీటితో పాటు కరీంనగర్ మోడల్ రోడ్లు, స్కై వాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్ పోర్ట్ వంటివి ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల విలువ రూ.5681.04 కోట్లు కాగా ఇందులో కేంద్రం 25 శాతం నిధులను ఇవ్వనుంది. అందులో భాగంగా రూ.1420.26 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 25 శాతం నిధులు కేటాయించాల్సి ఉండగా, మిగిలిన మొత్తాన్ని హడ్కో రుణం రూపంలో కేంద్రం నిధులను సమకూర్చనుంది.
వరంగల్ ప్రతిపాదనలు మాత్రమే
ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి హీరాలాల్ మిశ్రా నుంచి గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. ముందు రాష్ట్ర ప్రభుత్వం పంపిన యూసీఎఫ్ ప్రతిపాదనల జాబితాలో కరీంనగర్ లేదు.. వరంగల్ కార్పొరేషన్ ప్రతిపాదనలను మాత్రమే యూసీఎఫ్ పథకంలో చేర్చారు. ఖమ్మం- వరంగల్- కరీంనగర్ కారిడార్‌ను కూడా ఈ స్కీంలో చేర్చారు. అందులో భాగంగా ఆయా ప్రతిపాదనలకు సంబంధించి డీపీఆర్‌ను కూడా కేంద్రానికి పంపారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సైతం యూసీఎఫ్ జాబితాలో చేర్చాల్సిందేనని పట్టుపట్టారు. ప్రధాని మోడీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ లను కలిసి ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరారు.
పలుమార్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతోనూ చర్చించి తెలంగాణ నుంచి వచ్చిన 3 ప్రతిపాదనలకు యూసీఎఫ్ నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. యూసీఎఫ్ స్కీం ద్వారా రానున్న రూ.840 కోట్ల నిధులతో కరీంనగర్‌లో స్కై వాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, మోడల్ రోడ్లు, డ్రైయిన్లను పునరుద్దరించనున్నారు. హైదరాబాద్ తర్వాత అధునాతన సౌకర్యాలతో కరీంనగర్ సుందర నగరం కానుంది.






