Bandi Sanjay : గ్రూప్ 1 వివాదం... TGPSC కి బండి సంజయ్ లేఖ

by Muthe.Rajitha |   (  Updated:2025-04-30 10:25:50  IST  )

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఛైర్మన్ కు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) లేఖ రాశారు.

Bandi Sanjay : గ్రూప్ 1 వివాదం... TGPSC కి బండి సంజయ్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఛైర్మన్ కు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) లేఖ రాశారు. గ్రూప్ 1 వ్యవహారం(Group 1 Issue)పై పూర్తి సమాచారం వారంలోపు అందించాలని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం(Burra Venkatesham)కు లేఖ రాశారు. గ్రూప్ 1 అభ్యర్థులు లేవనెత్తిన అనుమానాలు, అంశాలను లేఖలో పేర్కొంటూ.. ఆయా విషయాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని సూచించారు. కాగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో, పేపర్ వాల్యుయేషన్ లో తప్పిదాలు జరిగాయంటూ భారీగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ అంశంలో జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు బండి సంజయ్ ని కోరగా.. ఈ మేరకు ఆయన టీజీపీఎస్సీ ఛైర్మన్ కు నేడు లేఖ రాశారు. అయితే ఈ లేఖపై ఇప్పటివరకు కమిషన్ గాని, ఛైర్మన్ బుర్రా వెంకటేశం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Next Story