- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తంచేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇవాళ బహిరంగ లేఖ రాశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలని, నీలోజీపల్లి నుంచి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌ను, స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ సహా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలని, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలని లేఖలో పేర్కొన్నారు.






