- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజాసింగ్ కట్టర్ హిందూ.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh)పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Raja Singh)పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం రాజాసింగ్‌తో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజాసింగ్ పార్టీలో చాలా సీనియర్ లీడర్ అని అన్నారు. హిందూ ధర్మం కోసం పోరాడే ఖట్టర్ హిందూ అని పేర్కొన్నారు. హిందూ సంస్కృతి ప్రమాదంలో పడిన ప్రతీ సారి రాజాసింగ్ ప్రాణాలకు తెగించి పోరాడారని అన్నారు. ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ కీలక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయాలు నచ్చక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో రాజాసింగ్‌కు బుజ్జగించేందుకు బండి సంజయ్ రంగంలోకి దిగారు. పాతబస్తీలోని ఆకాశ్ పురి హనుమాన్ దేవాలయంలో పూజలు చేసిన అనంతరం రాజాసింగ్‌తో సమావేశం అయ్యారు. మళ్లీ తిరిగి బీజేపీ కార్యక్రమాలకు అందుబాటులో ఉండాలని బండి సంజయ్ కోరారు. మెల్లగా సమస్యలన్నీ అవే సర్దుకుంటాయని హామీ ఇచ్చారు. అయితే. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సమయం ఆసన్నమైన వేళ వీరు భేటీ కావడం మరో వాదనకు తెరలేపింది. తాను అధ్యక్ష రేసులో లేనని బండి సంజయ్ ప్రకటించినప్పటికీ.. ఆయన మద్దతు ఎవరికి ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. మద్దతు కూడగట్టేందకే రాజాసింగ్‌తో భేటీ అవుతున్నారా..? అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంచితే, హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ తరుపున గౌతంరావు బరిలోకి దిగారు. దీనిపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.






