- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాళ్లంతా నక్సలైట్ల వారసులు.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS)లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS)లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) హాట్ కామెంట్స్ చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని బర్కత్ పురాలో బీజేపీ(BJP) నాయకులతో బండి సంజయ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు నక్సలైట్ల వారసులని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటారా? అని మండిపడ్డారు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను చంపేస్తామన్న మజ్లిస్‌ను గెలిపించేందుకు కుట్ర చేస్తారా? అని సీరియస్ అయ్యారు.
మజ్లిస్(MIM) మాటలకు హిందూ సమాజమంతా రగలిపోతోందని అన్నారు. విప్‌కు భయపడి ఓటింగ్‌కు దూరమైనా, మజ్లిస్‌కు ఓటేసినా మీ రాజకీయ భవిష్యత్తు ఖతమే అని కార్పొరేటర్లకు సూచించారు. వక్ఫ్‌పై మజ్లిస్ బహిరంగ సభకు కాంగ్రెస్సే కారణమని అన్నారు. కాంగ్రెస్ నేతలు స్పాన్సర్ చేస్తేనే మజ్లిస్ నేతలు సభ పెట్టుకోగలిగారని తెలిపారు. దమ్ముంటే తెలంగాణలో వక్ఫ్ ఆస్తులు, ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాముడి వారసులెవరో.. రజకార్ వారసులెవరో ప్రజలకు తెలుసని అన్నారు. అనంతరం జీహెచ్ఎంసీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.






