- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలేంటి?.. CM రేవంత్‌పై బండి సంజయ్ ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కౌంటర్ ఇచ్చారు. ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు అడిగితే బ్లాక్‌మెయిల్ చేస్తారా? అని సీరియస్ అయ్యారు. ఫీజు రియింబర్స్‌మెంట్(Fee Reimbursement) ఇవ్వకుంటే కాలేజీలు ఎలా నడుస్తాయని ప్రశ్నించారు. అధ్యాపకులకు జీతాలు ఇవ్వకపోతే ఎలా అని అడిగారు. నెలకు రూ.500 కోట్ల చొప్పున చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. టోకెన్లు ఇచ్చి మోసం చేసింది నిజం కాదా? అని అడిగారు. అప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందనే విషయం గుర్తుకు లేదా?.. అప్పుల్లో ఉంటే టోకెన్లు ఎందుకు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఒక్క రూపాయి చెల్లించకుండా కాలేజీలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. చట్టసభలో ఇచ్చిన హామీకి విలువలేదా? అని మండిపడ్డారు. బకాయిలు చెల్లించి చట్టం గురించి మాట్లాడితే బాగుండేది అన్నారు.
కాలేజీ యాజమాన్యాలపై సీఎంకు ఉన్న కోపంతో విద్యార్థుల జీవితాలను బలి చేయాలనుకుంటున్నారా? అని సీరియస్ అయ్యారు. ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది. చట్టం పేరుతో బెదిరింపులకు పాల్పడితే పాలన నడవదనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేదాకా విద్యార్థులు, అధ్యాపకులు, కాలేజీ యాజమాన్యాలు చేసే ఆందోళన కార్యక్రమాలకు బీజేపీ మద్దతు కొనసాగుతుంది.






