MLC ఎన్నికల ప్రచారంలో రాజాసింగ్.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

by Gantepaka Srikanth |

అసంతృప్తిలో ఉన్న బీజేపీ(Telangana BJP) ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja Singh)ను బండి సంజయ్(Bandi Sanjay) బుజ్జగించారు.

MLC ఎన్నికల ప్రచారంలో రాజాసింగ్.. క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: అసంతృప్తిలో ఉన్న బీజేపీ(Telangana BJP) ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja Singh)ను బండి సంజయ్(Bandi Sanjay) బుజ్జగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక నుంచి రాజాసింగ్ పార్టీ లైన్‌లో ఉంటారని అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటారని బండి సంజయ్ ప్రకటించారు. ఈ ఎన్నికలను బీజేపీ శ్రేణులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎమ్ఐఎమ్(MIM) ఒకవైపు ఉంటే.. బీజేపీ ఒక్కటే ఒకవైపు ఉందని అన్నారు. కార్పొరేటర్లంతా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.

ఎమ్ఐఎమ్‌కు ఓటు వేసేముందు ఒకటిరి రెండు సార్లు ఆలోచించుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా.. బండి సంజయ్ సమక్షంలో హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు(Gautam Rao) రాజాసింగ్‌ను కలిశారు. అంతకుముందు హిందూసమాజ సంఘటితం కోసం పోరాడే నేత రాజా సింగ్‌ అని బండి సంజయ్‌ అన్నారు. తామంతా ఒకటేనని, తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి ఆకాశ్‌పురి హనుమాన్ గుడిని సంజయ్‌ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయనతో కాసేపు ముచ్చటించారు.

Next Story