- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bandi Sanjay: మోడీ పిలుపుతో దేశం త్రివర్ణ శోభితం.. కేంద్ర మంత్రి స్పెషల్ ట్వీట్
మోడీ పిలుపులో యావత్ దేశం త్రివర్ణ శోభితమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మోడీ పిలుపులో యావత్ దేశం త్రివర్ణ శోభితమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అధికారిక నివాసంలో జెండా ఎగురవేసిన ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన హర్ ఘర్ తిరంగాతో దేశం త్రివర్ణ శోభితమైందని అన్నారు. యావత్ భారతదేశం ఒక్క తాటిపైకి వచ్చి, జాతి మొత్తం సగర్వంగా త్రివర్ణ పతాకం వైపు చూసేలా చేసిందని చెప్పారు. ఇక స్వాతంత్ర్య వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగరవేయడం జరిగిందని చెబుతూ.. దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. కాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోడీ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.






