- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘హిందూ ఏక్తా యాత్ర’ డేట్ ఫిక్స్.. యువతకు బండి సంజయ్ కీలక పిలుపు
by Satheesh |
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 14న కరీంనగర్‌లో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 14న కరీంనగర్‌లో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించనున్నారు. ఈ యాత్రకు ముఖ్య అతిథిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ హాజరుకానున్నారు. ప్రతిఏటా కరీంనగర్‌లో నిర్వహించే ఈ యాత్రకు హిమంత తో పాటు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ సైతం పాల్గొననున్నారు. దాదాపు లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించేందుకు బండి సంజయ్ ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ ఏక్తా యాత్ర ద్వారా హిందూ సంఘటిత శక్తిని చాటుతామని బండి సంజయ్ పేర్కొన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొనాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Next Story






