రాజకీయ కుట్రకు తెర లేపిన Bandi Sanjay : Jagtial MLA Dr.M.Sanjay Kumar

by Bhoopathi Nagaiah |   (  Updated:2022-11-28 09:43:34  IST  )

ప్రశాంతంగా ఉన్న జగిత్యాల నియోజక వర్గంలో రాజకీయ కుట్ర చేసేందుకు ఎంపీ బండి సంజయ్ ప్రయత్నించారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వాఖ్యలు చేశారు.

రాజకీయ కుట్రకు తెర లేపిన Bandi Sanjay : Jagtial MLA Dr.M.Sanjay Kumar
X

దిశ, జగిత్యాల : ప్రశాంతంగా ఉన్న జగిత్యాల నియోజక వర్గంలో రాజకీయ కుట్ర చేసేందుకు ఎంపీ బండి సంజయ్ ప్రయత్నించారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వాఖ్యలు చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ అనుమతి లేని భైంసా సభకు బండి సంజయ్ వెళ్ళడం దురదృష్టకరం అని, ఇది వరకు సంజయ్ చేసిన యాత్రలకు, సభలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కానీ భైంసా సున్నితమైన ప్రదేశం కాబట్టి శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా అనుమతి నిరాకరించారన్నారు. అది పక్కన పెట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి అశాంతికి కారకులు అయ్యారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యల వల్ల అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మా నియోజక వర్గం అభివృద్ధిలో కుంటు పడుతుందని, ఇకనైనా బీజేపీ నాయకత్వం, కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రవర్తన, వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. బండి సంజయ్ పర్యటనలో జరిగిన వివాదాలను ఖండిస్తున్నాం అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీజేపీ నాయకులు చట్టానికి సహకరించాలని కోరారు.

Read More: దేశానికే తలమానికంగా 125 అడుగుల భారీ విగ్రహం : మంత్రి కొప్పుల

Next Story