- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MMTS బాధితురాలిని పరామర్శించిన బండి సంజయ్
సికింద్రాబాద్ MMTS రైలులో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) పరామర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ MMTS రైలులో లైంగిక వేధింపులకు గురైన బాధితురాలిని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) పరామర్శించారు. హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను బీజేపీ మహిళా మోర్చా నాయకులతో కలిసి.. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం మరింత మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎదుట మీడియాతో మాట్లాడారు. బాధితులపై దాడి జరిగి వారం గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంతవరకు నిందితులను పట్టుకోలేదని మండిపడ్డారు.
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నిందితులను పట్టుకున్నామని ప్రకటిస్తే.. పోలీసులేమో.. నిందితుల కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు.. అసలు ఎవరి మాటలు నమ్మాలి అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఒకవైపు పోలీసులు ఇంకా పట్టుకోలేదని మాట్లాడుతుంటే.. నిండు అసెంబ్లీలో ఆల్రెడీ పట్టుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడటం ఏంటని ఫైర్ అయ్యారు. తక్షణమే నిందితులను పట్టుకొని.. కఠినంగా శిక్షించి.. బాధితురాలిని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఇప్పటికే యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు పరామర్శించారు. బాధితురాలికి, ఆమె కుటుంబసభ్యులకు కమిషన్అండగా ఉంటుందని, అధైర్య పడొద్దని కమిషన్కార్యదర్శి ధైర్యం చెప్పారు.






