'కలాపాని' జైలును సందర్శించిన బండి సంజయ్

by Ajay Maddhiboyina |

కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ అండ‌మాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న క‌లాపాని జైలును సంద‌ర్శించారు. జైలులో వీర సావ‌ర్క‌ర్ సెల్ లోకి వెళ్లి ఆయ‌న‌కు నివాళులు అర్పించారు.

కలాపాని జైలును సందర్శించిన బండి సంజయ్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ అండ‌మాన్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న క‌లాపాని జైలును సంద‌ర్శించారు. జైలులో వీర సావ‌ర్క‌ర్ సెల్ లోకి వెళ్లి ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. అంతే కాకుండా స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల త్యాగాల‌ను స్మ‌రించుకుని నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్, వైప‌ర్ దీవుల‌ను ఆయ‌న తిల‌కించారు. అనంత‌రం జైలులో ఏర్పాటు చేసిన వీరుల పోరాట గాథ‌ల లైట్ అండ్ సౌండ్ షోలో పాల్గొన్నారు. ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన ఫోటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

కొన్ని ప్ర‌దేశాలు మిమ్మ‌ల్ని మార్చ‌కుండా వెళ్ల‌నివ్వ‌వు అంటూ కామెంట్ చేశారు. సుభాష్ చంద్ర‌బోస్ ద్వీపం, వైప‌ర్ ద్వీపాల గుండా వెళుతున్న‌ప్పుడు మాట‌ల కంటే నిశ్శ‌బ్దమే బిగ్గ‌ర‌గా అనిపించింద‌ని చెప్పారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు ఇంటికి దూరంగా ఉన్నా కూడా ఎంతో ధైర్యంగా పోరాడార‌ని వారి బాధ‌ను అర్థం చేసుకోవాల‌న్నారు. సావ‌ర్క‌ర్ జైలు గ‌దిలో కూర్చున్న‌ప్పుడు త‌న గొంతు ఉక్కిరిబిక్కిరైంద‌ని వ్యాఖ్యానించారు. ఆ గోడ‌లు ఊహించ‌లేద‌ని క్రూర‌త్వాన్ని చూశాయ‌ని అయిన‌ప్ప‌టికీ అవి దృఢ సంక‌ల్పంతో ప్ర‌తిధ్వ‌నిస్తాయ‌ని పేర్కొన్నారు. ఆయ‌న బాధ నుండి మ‌న‌కు స్వాతంత్య్రం వ‌చ్చింద‌న్నారు.

Next Story