BJP: రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ కీలక పిలుపు

by Prasad Jukanti |   (  Updated:2026-02-24 12:04:21  IST  )

కాంగ్రెస్, ఎంఐఎం వచ్చాక రాష్ట్రంలోని హిందూ ఆలయాలపై దాడులు పెరిగాయని బండి సంజయ్ విమర్శించారు.

BJP: రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా.. బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ కీలక పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అన్నారు. ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే జీహెచ్ఎంసీని ముక్కులు చేశారని రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎంఐఎంకు బుద్ధిచెబుతామన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఇవాళ బండి సంజయ్ పాతబస్తి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో (Bhagyalakshmi Temple Charminar) ప్రత్యేక పూజలు నిర్వహిచారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామన్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మం పరిరక్షణ కోసం పని చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు ఎంఐఎం బూట్లు నాకుతూ బతుకుతున్నాయని ఇది ఓ బతుకేనా అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల్లో ఉన్న హిందూ నాయకులు ఆలోచించుకోవాలని తాను ఎవరిని రెచ్చగొట్టడం లేదని వాస్తవాలు చెబుతున్నానన్నారు. కెబినెట్ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చర్చ జరగడం లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీకి మూటలు మోయడానికి తప్ప దేనికి పనికిరారని విమర్శించారు.

వాటిని పట్టించుకోవద్దు

కాంగ్రెస్ పాలనలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మా దేవాలయాలను కాపాడండి అంటూ మెజారిటీ హిందూ సమాజం బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా.. రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. సోషల్ మీడియాలో వచ్చే పనికిమాలిన విమర్శలను పట్టించుకోవద్దు. సనాతన ధర్మంపై, హిందూ దేవాలయాలపై దాడులను తిప్పికొట్టేందుకు మళ్లీ యుద్ధం మొదలుపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. మన ధర్మ రక్షణకై సమర శంఖం పూరిద్దాం.. కాషాయ జెండా పట్టుకొని తరలిరండి..రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుదామని పిలుపునిచ్చారు.

Next Story